ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రామ్ 'ది వారియర్' నుంచి 'బుల్లెట్ సాంగ్' రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 22, 2022, 06:54 PM

రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'ది వారియర్'. ఈ సినిమాలోని 'బుల్లెట్' అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. శ్రీమణి రాసిన ఈ పాటను సిలంబరసన్, హరిప్రియ పాడగా.. డిఎస్పీ మ్యూజిక్ ఇచ్చాడు.


కొద్ది రోజులుగా ఈ చిత్రం నుంచి అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ ‘బుల్లెట్’ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇందుకు తన మేకర్ ఓవర్ ను కూడా అదిరిపోయేలా మార్చేశాడు. అయితే ఈ  ‘కమన్ బేబీ లేట్స్ గో ఆన్ ద బుల్లెట్.. ఆన్ ద వే లో పాడుకుందాం డూయేట్టు’ అంటూ సాగే పాట ఆసాంతం వినసొంపుగా, రామ్ పోతినేని అభిమానుల్లో జోష్ నింపేలా ఉంది. ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకుపోతోందీ సాంగ్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ పోస్టర్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయ. ప్రస్తుతం విడుదలైన ఫస్ట్ సింగిల్ ఎనర్జిటిక్ బుల్లెట్ సాంగ్ కూడా దూసుకుపోతోంది. చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 14న రిలీజ్ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa