విజయ్ దేవరకొండతో తాను ‘జనగణమన’ సినిమాలో నటించనున్నట్లు వస్తున్న వార్తలను అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కొట్టిపారేసింది. ‘పుకార్లను నమ్మకండి. నేనిప్పటివరకు ఏ తెలుగు సినిమాను ఓకే చేయలేదు. ఒకవేళ ఏదైనా సినిమాకు సంతకం చేస్తే తప్పకుండా చెప్తా’ అని తెలిపింది. దీంతో జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లేనని తేలిపోయింది. కాగా పూరీ డైరెక్షన్‌లో జనగణమన షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa