సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు. తాజాగా సమంత నటిస్తున్న తమిళ చిత్రం ట్రైలర్ రిలీజ్ అయ్యింది. నయనతార, సమంత కలసి నటిస్తోన్న ఈ చిత్రానికి నయనతార ప్రియుడు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాకు కాతు వాకుల రెండు కాదల్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ చాలా కామెడిగా ఉంది. ప్రేక్షకులకు నవ్వులు తెప్పిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa