రవీనా టాండన్ ‘కేజీఎఫ్ 2’ చిత్రంలో ప్రధానమంత్రి రమికా సేన్ పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రవీనాకి మంచి పేరు రావడంతో ఆమెకు వరుసగా ఆఫర్స్ వచ్చిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ‘భవదీయుడు భగత్‌సింగ్’ చిత్రంలో ఆమెకి స్పెషల్ రోల్ ఆఫర్ చేశాడట హరీశ్. పాత్ర నచ్చడంతో రవీనా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
రవీనాటండన్ తెలుగులో ‘బంగారు బుల్లోడు, రథసారథి, ఆకాశవీధిలో’ లాంటి సినిమాల్లో ఒకప్పుడు కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వనుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమాతో రవీనాటండన్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa