'స్కామ్ 1992' ద్వారా ప్రతీక్ గాంధీ దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయ్యారు. హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తీసిన ఆ వెబ్ సిరీస్‌తో ఆయన పేరు మార్మోగింది. పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో హీరోగా ఆయన సినీ ప్రేక్షకులకు చేరువయ్యారు. ఈ క్రమంలో ఆదివారం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. షూటింగ్‌కు వెళ్లేందుకు పయనమైన తాను ట్రాఫిక్ సమస్యలో చిక్కుకున్నానన్నారు. ఆ సమయంలో తాను కారు దిగి వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే(డబ్ల్యూఈహెచ్)పై నడిచి వెళ్తున్నాన్నారు.
ఓ వీఐపీ వస్తున్న కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తిందన్నారు. అయితే తనను ఓ పోలీసు కాలర్ పట్టుకుని నెట్టేశాడన్నారు. తాను చెప్పింది కూడా కనీసం వినకుండా దురుసుగా ప్రవర్తించాడన్నారు. పక్కనే ఉన్న మార్బుల్ గోడౌన్‌లో తనను తోసేశారన్నారు. ప్రతీక్ గాంధీ చేసిన ఈ ట్వీట్‌పై నెటిజన్లు ఆయనకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ముంబైలో పర్యటించారు. ఆ కారణంగానే వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ప్రతీక్ గాంధీ ప్రస్తుతం 'పూలే' చిత్రంలో నటిస్తున్నారు. అందులో ఆయన 'జ్యోతి బాఫూలే'గా, పత్రలేఖ 'సావిత్రి ఫూలే' పాత్రలను పోషిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa