టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఫీల్ గుడ్ మూవీస్ తీయడంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. 2021లో నాగచైతన్య అండ్ సాయి పల్లవి నటించిన 'లవ్ స్టోరీ' సినిమాతో డీసెంట్ హిట్ కొట్టాడు. ఈ స్టార్ డైరెక్టర్ తాజాగా తమిళ స్టార్ హీరో సూర్యతో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారం. లేటెస్ట్ బజ్ ప్రకారం, అతను డైరెక్ట్ చేసిన లీడర్ మూవీకి సీక్వెల్ 'లీడర్ 2' సెలెక్ట్ చేయడానికి చూస్తున్నట్లు లేటెస్ట్ టాక్. సీక్వెల్ కాకపోతే ఈ స్టార్ హీరోతో ఒక పొలిటికల్ డ్రామా చేయొచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి శేఖర్ కమ్ముల నుంచి ఈ ప్రాజెక్ట్ పై కన్ఫర్మేషన్ రావాలంటే వేచి చూడాల్సిందే. ఈ దర్శకుడు ప్రస్తుతం కోలీవుడ్ హీరో ధనుష్‌తో తన తదుపరి సినిమాకి సంబంధించిన పనులలో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa