నేషనల్ అవార్డు విన్నింగ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో కనిపించనుంది. ఈ గ్లామర్ బ్యూటీ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో 'సాని కాయిదం' అనే చిత్రంలో నటిస్తుండగా, ఈ సినిమాకి తెలుగులో 'చిన్ని' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా డైరెక్ట్ గా OTTలో రిలీజ్ కానుంది. తాజాగా ఇప్పుడు ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్ బట్టి చూస్తే ఈ చిత్రంలో కీర్తి సురేష్ క్రూరమైన సీరియల్ కిల్లర్ పాత్రను పోషిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. మే 6, 2022 ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ సినిమాకి సామ్ సిఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa