ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రమాదానికి గురైన హీరో గోపీచంద్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 30, 2022, 01:27 PM

హీరో గోపీచంద్ నిన్న శుక్రవారం ప్రమాదానికి గురయ్యారు. ప్రస్తుతం గోపీచంద్ తన 30 వ చిత్ర షూటింగ్ లో ఉన్నాడు. ఈ షూటింగ్ మైసూర్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో గోపీచంద్‌కు ప్రమాదం జరిగినట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘మైసూర్‌లో జరుగుతున్న షూటింగ్‌లో కాలు కొద్దిగా స్లిప్‌ అవడంతో గోపీచంద్‌ పడిపోయారు. అయితే ఆయనకు ఏమీ కాలేదు. సురక్షితంగానే ఉన్నారు. అభిమానులు, స్నేహితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని దర్శకుడు శ్రీవాస్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిఱిమిస్తుంది. గతంలో ‘లక్ష్యం, లౌక్యం’ వంటి హిట్‌ చిత్రాల తర్వాత హీరో గోపీచంద్, డైరెక్టర్‌ శ్రీవాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూడో చిత్రం . ఇక ప్రస్తుతం గోపీచంద్ మారుతీ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ మూవీ చేసాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa