ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ "కేజీఎఫ్ 2" సరికొత్త రికార్డ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 02, 2022, 01:13 PM

KGF2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. యష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా తెలంగాణ రాష్ట్రంలో 40 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. దీంతో ఇప్పటి వరకు 40 కోట్ల మార్కును దాటిన డబ్బింగ్ సినిమాగా నిలిచింది. ఆచార్య బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన ఈ సినిమాతో నైజాం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు వచ్చాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa