పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన కళావతి, పెన్నీ,SVP టైటిల్ పాటలు శ్రోతలను మైమరిపిస్తున్నాయి. పోతే... షూటింగ్ తో పాటుగా ఒకేసారి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకున్న ఈ సినిమా మే 12 న విడుదల కానుంది. గత కొన్నిరోజులుగా చిత్రయూనిట్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో ప్రమోషన్స్ ను ఓ రేంజులో చేస్తుండగానే మూవీ నుండి రావాల్సిన మేజర్ అప్డేట్ రానే వచ్చేసింది. ఈ మేరకు చిత్రనిర్మాతలు అధికారిక ప్రకటన చేసారు, ఏమనంటే, సర్కారువారిపాట మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 7వ తేదీన, సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పొలిసు గ్రౌండ్స్ లో జరుగుతుందని తెలిపింది. దీంతో ఇరు తెలుగు రాష్ట్రాలలోని సూపర్స్టార్ ఫ్యాన్స్ ఆ ఈవెంట్ కు హాజరవటానికి సిద్ధమవుతున్నారు. అయితే, ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారన్న విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
మహేష్ లోని కామెడీ టైమింగ్ ను, ఫుల్ మాస్ యాక్షన్ ను చాలా కాలం తర్వాత ఆవిష్కరించిన చిత్రం ఇది. చెప్పాలంటే, ఈ సినిమా పోకిరి రోజులను గుర్తు చేస్తుంది. దీంతో సూపర్స్టార్ అభిమానులు ఈ సినిమా విజయం పట్ల చాలా నమ్మకంగా ఉన్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలంటే మే 12 వరకు ఆగాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa