ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సొట్ట‌ల బుగ్గ‌ల్లో సాంగ్ విడుద‌ల‌

cinema |  Suryaa Desk  | Published : Sun, May 08, 2022, 12:23 PM

మాస్‌రాజ ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుసగా సినిమాల‌ను చేస్తూ బిజీగా గ‌డుపుతున్నాడు. ఏడాదికి రెండు సినిమాల‌ను విడుద‌ల‌ చేసే విధంగా ర‌వితేజ ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇటీవ‌లే విడుద‌లైన‌ ‘ఖిలాడీ’తో భారీ ఫ్లాప్‌ను అందుకున్న మాస్‌రాజ ఈ సారి ‘రామారావు ఆన్ డ్యూటీ’తో ఎలాగైనా మంచి హిట్టు సాధించాల‌ని క‌సితో ఉన్నాడు. శ‌ర‌త్ మండ‌వ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మ‌వుతున్నాడు. ఇటీవ‌లే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ క్ర‌మంలో చిత్ర బృందం త‌రచూ ఏదో ఒక అప్‌డేట్‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌కరిస్తుంది. తాజాగా ఈ చిత్రంలోని సోట్ట‌బుగ్గ‌ల్లో పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.


మెలోడి సాంగ్‌గా విడుద‌లైన ఈ పాట శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటుంది. హ‌రిప్రియా, న‌కుల్ అభ్యంక‌ర్ ఆల‌పించిన ఈ పాట‌కు క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి సాహిత్యం అందించాడు. సామ్ సీఎస్ ట్యూన్ మంచి ఫీల్‌ను క్రియేట్ చేస్తుంది. ఇటీవ‌లే విడుద‌లైన ‘బుల్ బుల్ తరంగ్’ పాట‌కు విశేష స్పంద‌న వ‌చ్చింది. ఈ చిత్రంలో ర‌వితేజ‌కు జోడీగా దివ్యాంక కౌశిక్, ర‌జీషా విజ‌య‌న్‌లు హీరోయిన్లుగా న‌టించారు. చాలా కాలం త‌ర్వాత సీనియ‌ర్ న‌టుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. శ్రీ ల‌క్ష్మివెంక‌టేశ్వ‌రా సినిమాస్, ఆర్‌టి టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ల‌పై సుధాక‌ర్ చెరుకూరితో కలిసి ర‌వితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. ఈ చిత్రంలో ర‌వితేజ డిప్యూటీ క‌లెక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుద‌ల కానుంది.


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa