ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిత్రసీమలో సెంటిమెంట్ గా మారిన రౌడీ హీరో బర్త్ డే

cinema |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 12:42 PM

సపోర్టింగ్ రోల్స్ తో స్టార్ట్ చేసి సోలో హీరోగా ఆపై పాన్ ఇండియా స్టార్ గా అతి తక్కువ సమయంలోనే కెరీర్ లో టాప్ రేంజుకి ఎదిగిన హీరో విజయ్ దేవరకొండ. మే 9వ తేదీన అంటే ఈ రోజు విజయ్ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ప్రస్తుతం విజయ్ తన 11 వ సినిమా షూటింగ్ నిమిత్తం కాశ్మీర్ లో ఉన్నారు. VD #11 చిత్రబృందంతో కలిసి కాశ్మీర్ లోనే పుట్టినరోజును వేడుకులను జరుపుకుంటున్నారు. ఈ మేరకు విజయ్ నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం లైగర్ ప్రొమోషన్స్ ను ఈ రోజు నుండే ప్రారంభించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్సే కాకుండా ఎఫ్ 3, అంటే సుందరానికి, మేజర్, మలయాళ స్టార్ హీరో పృథ్విరాజ్ సినిమాల ప్రమోషన్స్ కు సంబంధించి ఈ రోజే కొన్ని అప్డేట్ లు రానున్నాయి. దీంతో నా బర్త్ డే అందరికీ సెంటిమెంట్ అయిపొయింది, వాళ్లందరికీ మంచే జరుగుతుంది. నా పవర్ ని కొంచెం వాళ్లకు కూడా పంచుతాను ... అంటూ విజయ్ తాజాగా ట్వీట్ చేసాడు. విజయ్ చేసిన ఈ ఫన్నీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa