ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ దేశం గర్వించదగ్గ నటుడు: పూరి జగన్నాధ్

cinema |  Suryaa Desk  | Published : Mon, May 09, 2022, 12:45 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలిసి తొలిసారి చేస్తున్న చిత్రం లైగర్. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ముందుగా పూరి-విజయ్ కాంబోనే ఒక స్పెషల్ అట్రాక్షన్. ఈ సినిమాతోనే విజయ్, మరియు పూరి ఇద్దరూ కూడా బాలీవుడ్ డిబట్ చేస్తున్నారు, పాన్ ఇండియా బరికోకి దిగనున్నారు. ఇంకా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్యా పాండే తొలిసారి ఒక తెలుగు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాను బాలీవుడ్లో పేరుగాంచిన నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించటం మరో విశేషం.


అయితే, లైగర్ సినిమానే కాకుండా విజయ్ -పూరి కాంబోలో మరో పాన్ ఇండియా సినిమా కూడా రానుంది. అదే JGM. ఇటీవలనే ప్రారంభమైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ మేరకు విజయ్, పూరీల మధ్య సాన్నిహిత్యం బాగా బలపడింది. నేడు విజయ్ పుట్టినరోజును పురస్కరించుకుని పూరి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలను తెలియచేసారు. ఈ మేరకు విజయ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తన పవర్ ఫుల్ యాక్టింగ్,తనలోని ఫైర్, ఆకలి, సినిమా పిచ్చి, వృత్తి పట్ల నిబద్ధత, మంచితనం.... ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు విజయ్ ను దేశం గర్వించదగ్గ నటుడిని చేస్తాయంటూ పూరి పేర్కొన్నారు. ఈ ట్వీట్ తో పూరీని విజయ్ ఎంతగా ప్రభావితం చేసాడో అర్ధం అవుతుంది. పోతే.... విజయ్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ రోజు లైగర్ మూవీ థీమ్ రిలీజ్ కానుంది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa