బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, మాజీ మిస్ ఇండియా మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న చారిత్రక నేపధ్య చిత్రం పృథ్విరాజ్. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూన్ 3న విడుదల కానుంది. ఆర్ ఆర్ ఆర్ , కేజీఎఫ్ 2 వంటి లార్జర్ దాన్ లైఫ్ చిత్రాల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ఇది.
తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ వేడుకలో అక్షయ్ మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు. చారిత్రక నేపధ్య చిత్రంలో నటించటంతో నటుడిగా తన జన్మ తరించిందని, తన తల్లి బతికుంటే తనను చూసి ఎంతో సంతోషించేదాన్ని చెప్పి అక్షయ్ కొద్దిసేపు గుంభనంగా ఉండిపోయారు. దీంతో ఆ ప్రాంగణమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ తర్వాత అక్షయ్ మాట్లాడుతూ.... చక్రవర్తి పృథ్విరాజ్ ఒక గొప్ప పాలకుడు. ఈ యుద్ధ వీరుడి చరిత్రను ప్రపంచంలో ఉన్న ప్రతి విద్యార్థి తెలుసుకుని తీరాలి. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఫిలిం.... అంటూ చెప్పుకొచ్చారు.
ఇక ట్రైలర్ విషయానికొస్తే, బాలీవుడ్ లో తెరకెక్కిన చారిత్రక సినిమాలు జోధా అక్బర్, పద్మావత్, బాజీరావు మస్తానీ తర్వాత ఈ సినిమా పేరు తప్పకుండా ఉంటుంది. అంతగొప్పగా ఉండనుంది. వందలకొద్దీ జూనియర్ ఆర్టిస్టులతో ఈ ట్రైలర్ లోని ప్రతీ సన్నివేశం కూడా చాలా గ్రాండ్ గా ఉంది. పృథ్విరాజ్ చౌహన్ చక్రవర్తి జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను ఎక్కడా రాజి పడకుండా చాలా గ్రాండ్ గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa