ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరంజీవి 'గాడ్ ఫాదర్' ఈ తేదీన విడుదల కానుందా?

cinema |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 01:11 PM

మోహన రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. "గాడ్ ఫాదర్" సినిమా మలయాళంలో "లూసిఫర్‌" సినిమాకు రీమేక్. ఈ సినిమాలో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. సెన్సషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, పొలిటికల్ డ్రామా ట్రాక్ లో వస్తున్న "గాడ్ ఫాదర్" సినిమాని ఆగస్టు 12న 2022 విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో సత్యదేవ్, బిజు మీనన్, అనసూయ, గద్దర్, మురళీమోహన్, గంగవ్వ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa