పరశురామ్ డైరెక్షన్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కథానాయిక. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ కి థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన కళావతి, పెన్నీ,SVP టైటిల్ పాటలు శ్రోతలను మైమరిపిస్తున్నాయి. పోతే... షూటింగ్ తో పాటుగా ఒకేసారి పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకున్న ఈ సినిమా మే 12 న విడుదల కానుంది. గత కొన్నిరోజులుగా చిత్రయూనిట్ ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు అంటూ తెగ హంగామా చేస్తుంది.
మహేష్ అభిమానులు కూడా, కటౌట్లు, ఫ్లెక్సీలు, హ్యాష్ ట్యాగ్ లు అంటూ సర్కారువారిపాటకు కావాల్సినంత ప్రొమోషన్ ను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా లోని మహేష్ ఫ్యాన్స్ చేసిన ఒక కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తుంది. ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో మహేష్ మెడ మీద ఉండే రూపాయి నాణెం లాంటిదే వాళ్ళు కూడా తయారు చేసారు. ఇది నాణేనికి ఒక పక్క యితే మరో పక్క సూపర్స్టార్ బొమ్మ, సినిమా పేరు ను ముద్రించారు. ఈ నాణేన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా లాంచ్ చెయ్యటం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa