ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వెంకటేష్ "ప్రేమించుకుందాం... రా" సినిమాకు పాతికేళ్ళు

cinema |  Suryaa Desk  | Published : Wed, May 11, 2022, 12:00 PM

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు జయంత్ సి పరాంజీ తెరకెక్కించిన ప్రేమించుకుందాం... రా సినిమాకు ఈ ఏడాది తో పాతికేళ్ళు నిండాయి.  1997 మే 9 న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ హిట్ అయింది. దగ్గుబాటి వెంకటేష్, అంజలా జవేరి జంటగా నటించిన ఈ చిత్రానికి మహేష్ మహదేవన్ సంగీతమందించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం 1997 సంవత్సరానికి గాను అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనత సాధించింది. రాయలసీమ ఫ్యాక్షనిజం తో వచ్చిన తొలి సినిమా ఇదే. ఈ మేరకు చిత్రబృందమంతా కలిసి దర్శకుడు జయంత్ ఇంట్లో ఘనంగా పార్టీ చేసుకున్నారు. హీరో వెంకటేష్, బాబు మోహన్, వి. ఎన్. ఆనంద్, బెనర్జీ, రంజిత తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. స్కైప్ ద్వారా సురేష్ బాబు చిత్రబృందానికి శుభాకాంక్షలను తెలియచేసారు. కేక్ కట్ చేసి, షాంపైన్ పొంగించి షూటింగ్ రోజులను గుర్తుచేసుకున్నారు. సెలెబ్రేషన్ ఫోటోలను, వీడియోలను జయంత్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసాడు.  ఈ సినిమాతో బాగా ఫేమస్ ఐన లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్  ఈ ఫొటోల్లో మనకు కనిపిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa