తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ఎఫ్ 3. 2019 లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్ 2 కి సీక్వెల్ గా రానుంది ఎఫ్ 3. వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ లు ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవలనే విడుదలైన ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. వేసవి కానుకగా మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మేరకు చిత్రబృందం మూవీ ప్రమోషన్స్ నిమిత్తం క్యాష్ అనే టెలివిజన్ షో కు హాజరయ్యారు. ఈ టీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే ఈ షోకు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. క్యాష్ 200 ఎపిసోడ్ ను పురస్కరించుకుని తమన్నా, అనిల్ రావిపూడి, సోనాల్ చౌహన్, సునీల్ లు కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం ప్రోమో నిన్ననే విడుదలైంది. అనిల్ రావిపూడి, సునీల్ ఇద్దరూ కూడా తమ పంచ్ లతో సుమను ఓ రేంజులో ఆటపట్టించినట్టు తెలుస్తుంది. అలానే కొంతమంది యువకులు కలిసి తమన్నా కు, గులాబీ పూలు ఇచ్చి ప్రొపోజ్ కూడా చేసారు.
అయితే, ఈ ప్రోమో ఎండ్ లో తమన్నా కంటతడి పెట్టుకున్న విజువల్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తమన్నా ఎందుకు ఎమోషనల్ అయింది ? అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే, ఈ ప్రోగ్రాం పూర్తి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే. క్యాష్ న్యూ ఎపిసోడ్ మే 14న టెలికాస్ట్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa