కండలు తిరిగిన శరీరంతో నేటికీ అమ్మాయిల మనసును దోచుకుంటున్నాడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. 50 ఏళ్ల వయసు దాటినా ఆయన ఫిట్‌నెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే అందరూ ఆయనకు కండల వీరుడు అని పేరు పెట్టేశారు. శారీరకంగా ఎంతో దృఢంగా కనిపించే సల్మాన్ ఖాన్ ఇటీవల ఓ కీలక విషయం వెల్లడించాడు. ఒకానొక దశలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పాడు. 'ట్రైజెమినల్ న్యూరాల్జియా' అనే నరాల సమస్యను తనను తీవ్రంగా వేధించిందని దుబాయ్‌లో ఇటీవల జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో సల్మాన్ ఖాన్ చెప్పాడు. ఈ సమస్య వల్ల తాను ఎక్కువ సేపు మాట్లాడలేకపోయే వాడినని చెప్పాడు. ఒక వేళ మాట్లాడడానికి ప్రయత్నించినా తన ముఖం అంతా బాగా నొప్పిగా ఉండేదని, మూతి వంకర్లు పోయేదని పేర్కొన్నాడు.
తనను ఆ సమస్య తీవ్రంగా వేధించిందని సల్మాన్ ఖాన్ తెలిపాడు. కనీసం బ్రష్ చేసుకున్నా, మేకప్ వేసుకున్నా చాలా నొప్పిగా ఉండేదన్నారు. ముఖ్యంగా రాత్రి వేళ ఈ సమస్య తనను తీవ్రంగా క్రుంగదీసేదని, ఒక్కోసారి నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టముట్టేవని చెప్పాడు. దీనికి ప్రస్తుతం తాను అమెరికాలో ప్రముఖ వైద్యుల సమక్షంలో చికిత్స తీసుకుంటున్నట్లు వివరించాడు. వైద్యులు ఈ వ్యాధిని ప్రమాదకరంగా అభివర్ణిస్తుంటారు. దీని బారిన పడిన వారు ఎక్కువమందికి ఆత్మహత్యను ప్రేరేపించే ఆలోచనలు వస్తాయని ధ్రువీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa