బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం తన కొత్త సినిమా జయేష్ భాయ్ జోర్దార్ ప్రమోషన్స్ లో చాలా బిజీగా గడుపుతున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రణ్ వీర్ మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో వచ్చిన చిత్రాలలో పుష్ప సినిమాలోని ఊఁ అంటావా నా ఫెవరెట్ సాంగ్ లలో ఒకటి గా మారిపోయింది. లిరిక్స్ నాకు అర్ధమవ్వనప్పటికీ మ్యూజిక్ నా హార్ట్ ను టచ్ చేసింది. ఆ పాట విన్న ప్రతిసారి కూడా నాకు పిచ్చిపట్టినట్టు అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.
హిందీలో కూడా ఈ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. యూట్యూబులో 273 మిలియన్ వ్యూస్ తో ఒక రేంజులో దూసుకుపోతుంది. DSP కంపోజ్ చేసిన ఈ పాటను హిందీలో కనికా కపూర్ ఆలపించారు. ఇక పుష్ప సినిమా కూడా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సుమారు రూ. 100 కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa