టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ నటిస్తున్న సరికొత్త చిత్రం శేఖర్. మలయాళ సూపర్ హిట్ ఫిలిం జోసెఫ్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని రాజశేఖర్ భార్య జీవిత డైరెక్ట్ చేసారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఇటీవలనే ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో సస్పెండెడ్ పోలీసాఫీసర్ గా రాజశేఖర్ నటించనున్నట్టు తెలుస్తుంది. తెల్లని గడ్డం, జుట్టుతో రాజశేఖర్ లుక్ డిఫరెంట్ గా, ప్రేక్షకులకు నచ్చేట్టు ఉంది. మర్డర్ మిస్టరీ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ముస్కాన్ హీరోయిన్ గా నటించింది.
తాజాగా ఈ మూవీ నుండి చిన్ని చిన్ని ప్రాణం అనే లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. చిన్మయి తో కలిసి హేమంత్ మహ్మద్ ఆలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa