అనతికాలంలోనే జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకొన్న తారా పూజా హెగ్డే. అందుకే ఆమెకు తాజాగా ఓ అరుదైన అవకాశం దక్కింది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు భారత ప్రతినిధిగా ఆమె హాజరు కానున్నారు. ఈ ఏడాది కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలు ఈ నెల 17న మొదలు కానున్నాయి. ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ వేడుకల్లో భారత ప్రతినిధిగా పూజా హెగ్డే హాజరుకానున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ఇదిలా ఉంటే... దక్షిణాది చిత్రాల్లో సత్తా చాటుతున్న పూజ... కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలకు ఈ ఏడాదే తొలిసారి హాజరు కానుంది. అంటే... ఈ వేడుకలకు తొలిసారి హాజరవుతున్న సమయంలోనే భారత దేశ ప్రతినిధిగా వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారన్న మాట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa