స్టార్ హీరోలా తెలుగు సినిమాలకు ఇటీవల కాలంలో తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్లు ఇస్తూ వస్తోంది. మహేశ్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. ఇప్పటికే ఈ సినిమాకు నైజాం ఏరియాలో వారం రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వగా.. తాజాగా మే 12 వేకువజామున స్పెషల్ షోకు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌లోని నాలుగు థియేటర్లలో మే 12న ఉదయం 4 గంటలకే ఈ స్పెషల్ షోలు ప్రదర్శించనున్నారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్ సినిమా హాళ్లతో పాటు మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్‌లో ఈ స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చారు. స్పెషల్ షోల టికెట్ల కోసం ఇప్పటికే తీవ్రమైన పోటీ నెలకొంది.
వెంకటేశ్వర ఫిల్మ్స్ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఇక మే 12 నుంచి 18 వరకు వారం రోజుల పాటు 5 షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి ఒంటి గంట మధ్య ఈ ఐదు షోలను ప్రదర్శించుకోవచ్చునని తెలిపింది. అభిమానుల హంగామాతో థియేటర్ల వద్ద ఇప్పటికే సందడి నెలకొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa