క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తన తొలి OTT సిరీస్ ని తారక రత్నతో చేస్తున్న సంగతి అందరికి తెలియసందే. ఈ సిరీస్ లో తారక రత్న సరసన మధు శాలిని జోడిగా నటిస్తుంది. ఈ సిరీస్ కి '9 అవర్స్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జూన్ 2, 2022 నుండి డిస్నీ హాట్‌స్టార్ లో ప్రీమియర్ కి సిద్ధంగా ఉంటాలు మేకర్స్ ప్రకటించారు. మూవీ మేకర్స్ ఈ విషయాన్ని తెలియజేసేందుకు ఒక స్పెషల్ పోస్టర్‌ని విడుదల చేసారు. ఈ వెబ్ సిరీస్ లో రవివర్మ, శ్రీతేజ్, సమీర్, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. క్రిష్ ఈ సిరీస్ కి రచయితగా మాత్రమే తన ఇన్‌పుట్‌ను అందిస్తున్నాడు. ఎపిసోడ్‌లకు నిరంజన్ కౌశిక్ మరియు జాకబ్ వర్గీస్ దర్శకత్వం వహించారు. శక్తికాంత్ కార్తీక్ ఈ వెబ్ సిరీస్‌కి సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa