టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తో దర్శకుడు హరీష్ శంకర్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేసారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెగ్డే జంటగా నటించనుంది. ఈ సినిమాలో అవార్డ్ విన్నింగ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది అని సమాచారం. తాజా సమాచారం ప్రకారం, అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ 'రైడ్' మూవీని ఈ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెలుగులోకి రీమేక్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే గతవారం హరీష్ శంకర్ ముంబైకి వెళ్లినట్లు లేటెస్ట్ టాక్. అయితే ఈ విషయం గురించి దర్శకుడి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం దర్శకుడు హరీష్ 'ATM' అనే తెలుగు వెబ్ సిరీస్‌కి సహ నిర్మాతగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa