శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోల్‌కతా నేపథ్యంలో జరుగుతుంది. అక్కడ భారీ షెడ్యూల్ జరిపారు. అనంతరం నేపాల్‌లో చిత్రీకరణ జరపనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి ఛాయాగ్రహణం నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. శర్వానంద్ కొత్తలుక్ అభిమానులను అలరించింది. సినిమాపై అంచనాలు పెంచింది.
ఇతర పాత్రల్లో మురళీ శర్మ, సునీల్, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, ప్రియారామన్, అభిషేక్ మహర్షి నటిస్తున్నారు. నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa