ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'NTR30' లో తారక్‌తో సాయి పల్లవి రొమాన్స్ చేయనుందా?

cinema |  Suryaa Desk  | Published : Mon, May 23, 2022, 02:29 PM

కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మూవీ మేకర్స్ 'ఎన్టీఆర్ 30' మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ మోషన్ పోస్టర్ కి తారక్ అభిమానుల నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, కొరటాల శివ గ్లామర్ బ్యూటీ సాయి పల్లవిని హీరోయిన్ గా నటించేందుకు సంప్రదించినట్లు సాయి పల్లవి కూడా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మూవీ మేకర్స్ నుంచి ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. 150 కోట్ల బడ్జెట్‌తో 'ఎన్టీఆర్ 30' సినిమాని తీస్తున్నట్లు సమాచారం. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa