కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పడుతున్నారు. ఒకపక్క దర్శకత్వం చేస్తూనే , మరోపక్క లీడ్ రోల్ లో నటిస్తూ ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. U. లహరి ఫిలింస్, LLP వీనస్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఉపేంద్ర కొన్నిరోజుల క్రితం ట్విట్టర్లో విడుదల చేశారు. ప్రజా ప్రభు ఫాన్స్ కి ఈ సినిమాని అంకితం చేస్తున్నట్లు ఆ ట్వీట్లో పేర్కొన్నారు ఉపేంద్ర. కన్నడ ఇండస్ట్రీ లో సక్సెస్ఫుల్ గా 33 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉపేంద్ర ఈ మూవీని ఎనౌన్స్ చేసారు. తాజాగా జూన్ 3 నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుందని సమాచారం అందుతుంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ను ఖరారు చెయ్యలేదు. ఈ మూవీ టైటిల్ ను, ప్రధాన పాత్రధారులను, టెక్నికల్ టీం ను జూన్ 3వ తేదీన ప్రకటించబోతున్నారు. బహు భాషా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa