ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సల్మాన్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జంటగా కనిపించనుంది. 'కభీ ఈద్ కభీ దివాళీ' అనే టైటిల్ ని ఈ మూవీకి మేకర్స్ లాక్ చేసారు. ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ సల్మాన్ సోదరులుగా నటిస్తుండగా, సాజిద్ నడియాడ్‌వాలా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో విలన్‌గా జగపతి బాబు నటించనున్నాడని లేటెస్ట్ టాక్. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa