ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న తలపతి 66

cinema |  Suryaa Desk  | Published : Fri, May 27, 2022, 11:52 AM

టాలీవుడ్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్ ఐన వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తుంది.  శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో దిల్ రాజు కోలీవుడ్ నిర్మాణరంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలనే పూజా కార్యక్రమంతో లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ తాజాగా లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ మేరకు చిత్రబృందం అధికారికంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అందులో విజయ్ తో వంశీ పైడిపల్లి దేనిగురించో డిస్కస్ చేస్తూ కనిపిస్తారు. ఈ భారీ షెడ్యూల్ లో మేజర్ స్టార్ క్యాస్ట్ తో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, జయసుధ, శ్రీకాంత్, శామ్, యోగిబాబు, సంగీత, సుకన్య పాల్గొన్నారు. త్వరలోనే మూవీ కొత్త షెడ్యూల్ ను ప్రారంభించి శరవేగంగా పూర్తి చేయాలనుకుంటున్నారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలకాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa