కమల్ హాసన్ - శంకర్ కాంబోలో,1996లో వచ్చిన "ఇండియన్" సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు పాతికేళ్ళ తర్వాత ఈ మూవీకి సీక్వెల్ "ఇండియన్ 2"ను తెరకెక్కబోతుంది. చాన్నాళ్ల క్రితమే అందుకు ముహూర్తం కూడా ఖరారయ్యింది. కొంత షూటింగును కూడా పూర్తి చేసిన తర్వాత పలు కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. దీంతో కమల్ హాసన్, శంకర్ తమ తదుపరి ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ఈ క్రమంలో కమల్ హాసన్ నటించిన చిత్రం విక్రమ్. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు. జూన్ 3న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో, ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కమల్ ఇండియన్ 2 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అందరు ఈ సినిమా ఆగిపోయిందని అనుకుంటున్నారని, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని, అందుకు సంబంధించి మేకర్స్ తో చర్చలు కూడా జరుగుతున్నాయని కమల్ చెప్పారు. పలు కారణాల వల్ల ఈ సినిమాకు లాంగ్ బ్రేక్ వచ్చిందని, తప్పకుండా ఇండియన్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని కమల్ పేర్కొన్నారు. దీంతో ప్రేక్షకాభిమానులు చాలా సంతోషం గా ఉన్నారు. ఇండియన్ 2 సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ రావాలంటే, మరి కొన్నాళ్ళు వెయిట్ చెయ్యక తప్పదు. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ నటిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa