ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సూపర్ స్టార్ చేతుల మీదగా ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ !

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 01, 2018, 12:17 PM

నితిన్ హీరోగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ఇప్పటికే ఈ చిత్రం పై రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. విడుదలైన ఈ చిత్ర ఆడియో కూడా బాగుండటంతో, నితిన్ రాశి ఖన్నా మధ్య కెమిస్ట్రీ బాగుటుందని టాక్ రావడంతో ‘శ్రీనివాస కళ్యాణం’కు మంచి బజ్ వచ్చింది.


తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు రేపు సాయంత్రం విడుదల చేయనున్నారు. ఈ చిత్రం మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా రాశీఖన్నాతో పాటు, నందిత శ్వేత కూడా కథానాయకిగా నటిస్తోంది. పూర్తి స్థాయి రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమా, భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నితిన్ నమ్మకంగా ఉన్నాడు. మరి నితిన్ ఆశించినట్లు ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa