ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్నయ్య ఛాలెంజ్ ను స్వీకరించిన పవన్

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 01, 2018, 12:19 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరిత హారం’ లో పాల్గొంటున్నారు ప్రముఖ సినీ నటులు, దాంట్లో భాగాంగా ఈరోజు ఉదయం మెగాస్టార్ చిరంజీవి తన ఇంటి పెరట్లో మూడు మొక్కలను నాటి ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు. అనంతరం బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్, ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావు తో పాటుగా తన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను ఈ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా చిరు కోరారు.


ఇక అన్నయ్య సవాల్ కు వెంటనే స్పందించి పవన్ కళ్యాణ్ ఈ రోజు హైదరాబాద్లోని మాదాపూర్ లోఉన్న జనసేన కార్యాలయంలో మొక్కలను నాటారు. ఇక ఇంత మంచి కార్యక్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు చిరంజీవి ,పవన్ కళ్యాణ్ , కింగ్ నాగార్జున , సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి సినీ ప్రముఖులు పాల్గొన్నారు. మరి పోను పోను ఇంకా ఎంతమంది సినీ తారలు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొంటారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa