ధృవ దర్శకత్వం వహించిన ఓ కఠోర నిజం అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న 'కిరోసిన్' సినిమా జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌తో కిరోసిన్ విడుదల తేదీని ప్రకటించారు. ప్రస్తుతం మూవీ టీమ్ ఈ సినిమా ప్రొమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌లకు సినీ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రంలో ధృవ, ప్రీతి సింగ్, భావన మణికందన్, బ్రహ్మాజీ, మధుసూదన్ రావు, కంచెరపాలెం రాజు, సమ్మెట గాంధీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దీప్తి కొండవీటి, పృథివి యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa