అశోక వనంలో అర్జున కళ్యాణం: విద్యాసాగర్ చింతా దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ నటించింన "అశోక వనంలో అర్జున కళ్యాణం" మే 6, 2022న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. విశ్వక్ సేన్ సరసన ఈ సినిమాలో రుక్సార్ ధిల్లాన్ జంటగా నటించింది. ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో కాదంబరి కిరణ్, గోపరాజు రమణ, కేదార్ శంకర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో జూన్ 3, 2022న ఈ సినిమా ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం అందించారు.
జన గణ మన: డిజో జోస్ ఆంటోని దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'జన గణ మన' సినిమా OTT ప్లాట్‌ఫామ్‌పైకి రావడానికి సిద్ధంగా ఉంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా జూన్ 2, 2022న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. విన్సీ అలోషియస్, సిద్ధిక్, బెంజి మాథ్యూస్, ఆనంద్ బాల్, లిటిల్ దర్శన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ అండ్ మ్యాజిక్ ఫ్రేమ్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
9 అవర్స్: క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ తన తొలి OTT సిరీస్ ని తారకరత్న తో చేస్తున్న సంగతి అందరికి తెలియసందే. ఈ సిరీస్ లో తారక రత్న సరసన మధు శాలిని జోడిగా నటిస్తుంది. ఈ సిరీస్ కి '9 అవర్స్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. జూన్ 2, 2022 నుండి డిస్నీ హాట్‌స్టార్ లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ లో రవివర్మ, శ్రీతేజ్, సమీర్, ప్రీతి అస్రానీ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. శక్తికాంత్ కార్తీక్ ఈ వెబ్ సిరీస్‌కి సంగీతం అందిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను వై. రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు.