బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన 'పృథ్వీరాజ్' సినిమాపై కువైట్, ఒమన్ దేశాలు నిషేధం విధించాయి. అయితే అందుకు గల కారణాలు వెల్లడి కాలేదు. సినిమా పేరు మార్చాలని మే 27న కర్ణి సేన లేఖ ద్వారా డిమాండ్ చేసింది. ఈ ప్రతికూలతల మధ్య జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో అక్షయ్‌కు జోడీగా మానుషి చిల్లర్ నటించింది. సోనూసూద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు.