బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న చారిత్రక నేపధ్య చిత్రం పృథ్విరాజ్. ఆర్ ఆర్ ఆర్ , కేజీఎఫ్ 2 వంటి లార్జర్ దాన్ లైఫ్ చిత్రాల తర్వాత బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం ఇది. భారతదేశ వీర పౌరుడు, నిజాయితీ గల చక్రవర్తి , అతి క్రూరుడైన మహమ్మద్ ఘోరీ నుండి భారతదేశాన్ని కాపాడిన పృథ్విరాజ్ చౌహన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాణి సంయోగిత పాత్రలో మాజీ ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్, సంజయ్ దత్, సోనూసూద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాను నిర్మించారు.
చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషలలో జూన్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో పృథ్విరాజ్ సినిమా కొన్ని విదేశాల్లో నిషేధానికి గురి కావడం చిత్రానికి పెద్ద ఎదురుదెబ్బేనని చెప్పాలి. అరబ్ దేశాలైన ఒమన్, కువైట్ లలో సామ్రాట్ పృథ్విరాజ్ సినిమాను ఆయా ప్రభుత్వాలు నిషేధించినట్టు తెలుస్తుంది.