ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రెక్కీ' అనే కొత్త తెలుగు సిరీస్‌ని ప్రకటించిన ZEE5

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 02, 2022, 01:37 PM

భారతదేశంలోని ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లలో ZEE5 ఒకటి. ఈ పాపులర్ OTT ప్లాట్ఫారం తాజాగా ఇప్పుడు ఇంటెన్స్ థ్రిల్లర్ అయిన 'రెక్కీ' అనే మరో సిరీస్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా ప్రొఫైల్ లో ఈ సిరీస్ యొక్క అధికారిక మోషన్ పోస్టర్‌ను OTT ప్లాట్ఫారం విడుదల చేసింది. క్రైమ్ థ్రిల్లర్‌ ట్రాక్ లో రానున్న ఈ వెబ్ సిరీస్ జూన్ 17 నుండి ప్రసారం అవుతుంది అని వెల్లడించింది. ఈ సిరీస్ 7 ఎపిసోడ్‌ల వ్యవధిలో (ఒక్కొక్కటి 25 నిమిషాలు) ఉంటున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో శ్రీరామ్, శివబాలాజీ, ధన్య బాలకృష్ణ, ఆడుకలం నరేన్, ఈస్టర్ నొరోన్హా జీవా, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీరామ్ మద్దూరి ఈ సిరీస్ కి సంగీతం అందిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీరామ్ కొలిశెట్టి ఈ సిరీస్ ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa