మలయాళ భామ నజ్రియా నజీమ్ ఇప్పటికే మలయాళం, తమిళ్ సినిమాలతో బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం నాని సరసన 'అంటే సుందరానికి' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ లో భాగంగా ఇలా మెరిపించింది.
నేచురల్ స్టార్ నాని మళ్లీ నవ్వించే పాత్రలో కనిపించాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన అంటే సుందరానికి చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. టీజర్ సినిమాపై బోలెడంత అంచనాలను క్రియేట్ చేయగా, ట్రైలర్ సినిమాల్లో మరింత వినోదాన్ని పంచుతుంది. సుందర్ మరియు లీలా థామస్ పాత్రలతో విలక్షణమైన ప్రేమకథకు మెరుపు తెచ్చిన నాని మరియు నజ్రియా నజీమ్ లు ఆకట్టుకున్నారు.
![]() |
![]() |