నగరం, ఖైదీ, మాస్టర్ లాంటి సినిమాలతో యాక్షన్ సినిమాలంటే ఇలా ఉండాలి అనే బెంచ్ మార్కును డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ చిత్రసీమలో సెట్ చేసి పెట్టారు. తాజాగా విక్రమ్ తో ఆ బెంచ్ మార్కును మరింత పైకి తీసుకెళ్లారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం విక్రమ్. విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు. హీరో సూర్య అతిధి పాత్రలో నటించారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందించిన ఈ చిత్రం నేడు విడుదలై పాజిటివ్ టాక్ తో థియేటర్లలో రన్ అవుతుంది. సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు లోకేష్ కనగరాజ్ ఒక ఎమోషనల్ నోట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. చిన్నప్పుడు తన అభిమాన హీరో కమల్ హాసన్ అని, ఇప్పుడు తన డైరెక్షన్లో ఆయన నటించటం నిజంగా తనకు దక్కిన అరుదైన గౌరవమని లోకేష్ తెలిపారు. ఈ సినిమా కోసం తాను, తన టీం మెంబర్స్ అందరూ 18నెలల పాటు ఏకధాటిగా నిర్విరామంగా కృషి చేశామని లోకేష్ చెప్పారు. ఒక ఫ్యాన్ బాయ్, కమల్ కి ఇస్తున్న బహుమతే విక్రమ్.. ఇంకొన్ని గంటల్లో విక్రమ్ సినిమా మీ సొంతం, థియేటర్లో విక్రమ్ మ్యాజిక్ ను మిస్ అవ్వొద్దు. విక్రమ్ ను చేసేముందు దయచేసి కార్తీ నటించిన ఖైదీ సినిమాను తప్పక చూడండి ... అంటూ లోకేష్ తను పోస్ట్ చేసిన నోట్ లో రాసుకొచ్చాడు.