'విక్రమ్ వేద' వంటి సూపర్ హిట్ సినిమాని అందించిన పుష్కర్-గాయత్రి ఇప్పుడు 'సుజల్: ది వోర్టెక్స్' అనే వెబ్ సిరీస్‌ను రూపొందిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. బ్రమ్మ మరియు అనుచరణ్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో నటించింది. ప్రముఖ OTT ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ వెబ్ సిరీస్‌ను ప్రకటించడానికి ఒక స్పెషల్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ వీడియో గ్లింప్సె సిరీస్‌లోని ప్రధాన టీమ్ ని వెల్లడిస్తుంది. రాధాకృష్ణన్ పార్థిబన్, శ్రీయా రెడ్డి ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్‌ని పుష్కర్-గాయత్రి నిర్మించారు. సుజల్: వోర్టెక్స్ సీజన్ 1 OTT ప్లాట్‌ఫారమ్‌లో జూన్ 17, 2022న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీలో విడుదల కానుంది.