ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సర్కారువారిపాట ఓటిటి స్ట్రీమింగ్ డేట్ ఖరారు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 04, 2022, 02:29 PM

పరశురామ్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారిపాట. మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. మే 12న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ధియేటర్ల వద్ద అప్రతిహతంగా ప్రదర్శింపబడుతోంది. తొలుత మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ, కలెక్షన్లు మాత్రం సూపర్ స్పీడ్ లో దూసుకుపోతున్నాయి. ఇటీవలే మ మ మ మాస్ సెలెబ్రేషన్స్ పేరిట SVP సక్సెస్ సెలెబ్రేషన్స్ ను నిర్మాతలు ఘనంగా నిర్వహించారు. నిన్ననే రెంటల్ బేసిస్ మీద అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సర్కారువారిపాట జూన్ 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లోనే ఉచితంగా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మేకర్స్, ఓటిటి అమెజాన్ సంస్థ త్వరలోనే అధికారిక ప్రకటన చెయ్యనున్నారట. మాస్ అండ్ సోషల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్ హిట్ గా నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa