బాలీవుడ్ యాక్టిస్ నర్గీస్ ఫక్రీ తన మానసిక ఆరోగ్యం గురించి ఓపెన్ అయింది. తాజాగా ఓ ప్రముఖ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలోని వ్యక్తిగత విష యాలతోపాటు ఇండస్ట్రీలో ఎదురయ్యే ప్రతికూలతను ఎలా ఎదుర్కోవాలో చెప్పింది. 'నేను 15 ఏళ్ల నుంచి సెల్ఫ్. హెన్‌కు సంబంధించిన బుక్స్ చదువుతున్నా. జీవితం ఎల్లప్పుడూ అనేక మలుపులు తిరిగే ప్రయాణమే. కాబట్టి మనం ఎలా మారుతున్నాం? ఎలా ఎదుగుతున్నాం? అనే విషయాలపై ఫోకస్ చేయడం కోసం సైకాలాజీ బుక్స్ చదవాలి. ఇతరుల విషయాలు నచ్చకపోతే అది నా కెందుకు నచ్చదు? అది నాలో కూడా ఉందా లేదా? అని ఆత్మపరిశీలన చేసుకుంటూ మెరుగ్గా ఉండేదుకు ప్రయత్నం చేయాలి' అని చెప్పుకొచ్చింది. అలాగే తాను చేసే పనికి ఎల్లప్పుడూ జవాబు దారీగా ఉంటానని, తనను తాను నిందించుకోవడం లేదా బలిపశువును చేసుకోకుండా జాగ్రత్తగా నడుచుకుంటానని తెలిపింది. ఇక ప్రజలు తమ మానసిక ఆరోగ్యాన్ని ఎప్పటి కప్పుడూ చెక్ చేసుకోవాలని, ప్రతికూల విషయాలు మాట్లా డుతున్నారో లేదో గుర్తించుకోవాలన్న నటి.. అలాంటి ఆలోచ నవస్తే చెంపదెబ్బ కొట్టుకుని తమను తాము మందలించుకో వాలని చెప్పింది. చివరగా పాటలు వినడం, వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మంచి వీడియోలు చూడటం మానసికంగా మేలు చేస్తాయని హితవు పలికింది.
![]() |
![]() |