సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ మురారి బావ పాటను SVP టీం యూట్యూబులో రిలీజ్ చేసింది. ముందుగా ఈ పాట జానపద నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరిగింది కానీ, మురారివా పాట మెలోడియస్ గా సాగింది. ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యమందించగా, సింగర్స్ శ్రీకృష్ణ, శృతి రంజని, గాయత్రి ఆలపించారు. మురారివా పాటలో మహేష్, కీర్తి సురేష్ జంట చూడముచ్చటగా ఉంది. ఈ మూవీ కి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసారు. సినిమా థియేటర్లలోకి రాకముందు విడుదలైన కళావతి, పెన్నీ, మ మ మ మహేష్, SVP టైటిల్ సాంగ్ లకు ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది. అయితే ఈ మూవీ నుండి చివరిగా విడుదలైన మ మ మ మహేష్ పాట స్థానంలో అంతకుముందు ఉన్న మురారివా పాట కోసం ప్రేక్షకులు విపరీతంగా ఎదురు చూడగా, సినిమా విడుదలైన నెల రోజులకు వారి కోరిక నెరవేరింది. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాని పరశురామ్ డైరెక్ట్ చెయ్యగా,మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, GMB ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa