లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లిపై గత కొన్నిరోజులుగా వస్తున్న పలు వార్తలను నిజం చేస్తూ, డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో, జూన్ 9న నయన్ తో తన పెళ్లి జరగబోతుందని చెప్పారు. నిన్న మీడియాలో జరిగిన ప్రచారం మేరకు విఘ్నేష్, నయన్ ఇద్దరూ కలిసి ఈ ప్రెస్ మీట్లో పాల్గొనాల్సి ఉంది. కానీ విఘ్నేష్ ఒక్కరే మీడియాతో మాట్లాడారు. ఈ గురువారం మహాబలిపురంలోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో తను నయనతారను పెళ్లి చేసుకోబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. నిజానికి తమ పెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగాల్సి ఉందని, కొన్నిరకాల ప్రాక్టికల్ ప్రాబ్లెమ్స్ ను దృష్టిలో ఉంచుకుని ఆ ఆలోచనను విరమించుకున్నట్టు పేర్కొన్నారు. తమ వివాహం జరిగిన రోజు మధ్యాహ్నం అంటే జూన్ 9 మధ్యాహ్నానికల్లా పెళ్లి ఫోటోలను విడుదల చేస్తామని చెప్పారు. జూన్ 11న నయన్ తో కలిసి మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని విఘ్నేష్ తెలిపారు. పెళ్ళికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa