ఎస్. శంకర్ తెరకెక్కించిన అద్భుతమైన విజువల్ వండర్ రోబోలో సూపర్ స్టార్ రజినీకాంత్, 1994 విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించింది ఈ ఒక్క సినిమాలోనే అయినా కానీ వీరి జంటకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. 2010లో వచ్చిన ఈ సినిమా తప్పిస్తే మరింకే సౌత్ సినిమాలోనూ ఇప్పటివరకు ఐశ్వర్య నటించలేదు. తిరిగి రజిని సినిమాతోనే సౌత్ కి రీఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది. దాదాపు పన్నెండేళ్ల తర్వాత రజిని కాంత్ - ఐశ్వర్య కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. రజిని కెరీర్ లో 169వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ, యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఐశ్వర్య ఈ ప్రాజెక్ట్ పై ఇటీవలే క్లారిటీ ఇచ్చింది. మణిరత్నం డ్రీం ప్రాజెక్టు గా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మూవీ షూటింగును ఇటీవలే పూర్తి చేసిన 48ఏళ్ళ ఐశ్వర్య రాయ్ రజిని 169వ సినిమాలో నటించబోతున్నట్టు పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ ను కే ఎస్ రవికుమార్ పర్యవేక్షిస్తారని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతమందిస్తున్నారు. ఆగస్టు నుండి రెగ్యులర్ షూట్ జరపడానికి చిత్రబృందం రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa