తేజ సజ్జా హీరోగా నటిస్తున్న సినిమా 'హనుమాన్'. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న వినయ్ రాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్‌రెడ్డి నిర్మిస్తున్నారు.