బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ గా గెలిచిన సన్నీపై దాడి జరిగింది. ప్రస్తుతం సన్నీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా హైదరాబాద్‌లోని హస్తినాపురం ప్రాంతంలో ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న బిగ్‌బాస్ విజేత సన్నీపై బుధవారం ఓ రౌడీషీటర్ దాడికి యత్నించాడు. హీరోపై దాడికి యత్నించగా, వెంటనే సిబ్బందిసన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రౌడీషీటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
![]() |
![]() |