లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో కమల్ హాసన్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి నటించిన 'విక్రమ్' సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లను రాబడుతుంది. తాజాగా ఇప్పుడు లోకేష్ తన తదుపరి సినిమాని తలపతి విజయ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా టైటిల్ రివీల్ వీడియో కోసం అనిరుధ్ ఇప్పటికే రాకింగ్ BGMని కంపోజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా గురించి సాలిడ్ అనౌన్స్ మెంట్ చేయడానికి మూవీ మేకర్స్ స్పెషల్ గా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa