వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "అంటే సుందరానికి" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ రాబడుతుంది. తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ చిత్రం USAలో ఇప్పటివరకు దాదాపు $400k వసూలు చేసింది. అంతేకాకుండా ఈ సినిమా USA బాక్స్ఆఫీస్ వద్ద $303,981 వసూలు చేసిన MCA మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది. ఎక్స్‌ప్రెషన్స్ క్వీన్ నజ్రియా నజీమ్ ఈ రొమాంటిక్ కామెడీ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ సినిమాలో నదియా, హర్ష వర్ధన్, సుహాస్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోమ్-కామ్ సినిమాని మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa